షాక్ ఇచ్చిన పవన్ నిర్మాత!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఆ సినిమాలో అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ పవన్ అన్నీ తానై, దర్సకున్ని పక్కన పెట్టి మరీ తానే అంతా నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం ఈ సినిమా విషయంలో దర్శకుడు డాలీకి , నిర్మాతకు మధ్య కాస్త విభేదాలు ఏర్పడ్డాయి అని, అయితే ఆ విభేధాలు తార స్థాయికి చేరి చివరకు సినిమా నిర్మాత నా వల్ల కాదు, అని చేతులెత్తేశాడు అని తెలుస్తుంది.

ఇంతకీ ఏం జరిగింది అంటే…ఖుషీ మూవీకి సీక్వెల్ గా రావాల్సిన ఈ మూవీ, డైరెక్టర్ ఎస్.జె.సూర్య తప్పుకోవటంతో మళ్ళీ ఓ కొత్త కథతో పవన్ కళ్యాణ్, దర్శకుడు డాలీతో తెరకెకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ దర్శకుడు ఒక ప్లాన్ తో డీల్ చేద్దాం అని అనుకున్నాడు, కానీ పవన్ పుణ్యమా అని ఆ అవకాశం లేకుండా పోయింది….అసలేం జరిగింది అంటే…దర్శకుడు డాలీ ప్లానింగ్ ప్రకారం మొదట హీరో, హీరోయిన్స్ కి సంబంధించిన సీన్స్ ని త్వరగా పూర్తి చేసి, తరువాత మిగతా సీన్స్ ని పూర్తి చేయాలని చూశాడు. కానీ పవన్ కళ్యాణ్ మార్పుతో మొదట హీరో, హీరోయిన్స్ కి సంబంధించిన సీన్స్ కాకుండా, ఇత సీన్స్ ని చిత్రీకరించాలని సలహాని ఇచ్చాడు.

దీనితో మన దర్శకుడు మన హీరోగారిని ఫాలో అయిపోతూ షూటింగ్ చేస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా, అసలు విషయం ఇక్కడే ఉంది, తాజా నిర్ణయం ప్రకారం, ఈ మూవీకి షెడ్యూల్స్ ఎక్కువుగా అవసరం కాబట్టి అనుకున్న దాని కంటే మరో 20 రోజులు షూటింగ్ డేట్స్ ని పెంచారు. దీంతో నిర్మాత ఎంత మాత్రం ఇందుకు అంగీకరించటంలేదు. ఇచ్చిన 5 నెలల గడువులోపే షెడ్యూల్స్ ని పూర్తి చేయాల్సిందిగా చెబుతూ….అంతకమించి ఎక్కువ రోజులు అయితే తాను భరించలేను అంటూ బోరు మంటున్నాడు అని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus