పవన్ కల్యాణ్ మరోసారి నిర్మాతగా మారుతున్నారు. ఏంటి? నిజమా అనుకుంటున్నారా. అవును టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. నాలుగేళ్ల తర్వాత పవన్ నిర్మాతగా మారబోతున్నారు. అప్పుడు అభిమాని కోసం పవన్ నిర్మాతగా మారితే… ఇప్పుడు తన కుటుంబ సభ్యుడి కోసం నిర్మాత అవతారం ఎత్తుతున్నారని టాక్. దీనిపై క్లారిటీ రావాల్సి ఉన్నా… విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పవన్ లాంటి సూపర్ స్టార్ మరోసారి నిర్మాతగా మారుతున్నారు అంటే విషయమే కదా.
అందులోనూ తన కోసం కాకుండా… తన కుటుంబ సభ్యుల కోసం అంటే కచ్చితంగా విశేషమే. పవన్ కల్యాణ్ గతంలోనూ సినిమాలు నిర్మించారు. అయితే చాలా సినిమాలకు నిర్మాతగా ఆయన పేరు పడలేదు. అయితే ఆ సినిమాలకు ఆయనే నిర్మాత అని అంటుంటాయి టాలీవుడ్ వర్గాలు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మాతగా, సహ నిర్మాతగా ఆ సినిమా రూపొందుతుంటాయి. అయితే రెండు సినిమాలకు మాత్రం నిర్మాతగా ఆయన పేరు పడింది.
అవే ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘ఛల్ మోహన్ రంగ’. తొలి సినిమాకు హీరో ఆయనే అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రెండో సినిమాకు పవన్ అభిమాని నితిన్ హీరో అనే విషయం తెలిసిందే. హీరోగా సినిమాల విషయంలో పవన్ టాలెంట్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నిర్మాతగా మాత్రం పవన్ సరైన ఫలితం ఇప్పటివరకు దక్కలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కానీ ‘ఛల్ మోహన్ రంగ’ కానీ సరైన విజయం అందించలేదు. అలాగే డబ్బులు కూడా రాలేదు.
ఇప్పుడు మరోసారి నిర్మాత అవుతున్నాడు. అయితే ఈసారి నిర్మాతగా మారుతున్నది కుటుంబ సభ్యుల కోసమంట. అయితే అదెవరు అనేది తెలియడం లేదు. అయితే వైష్ణవ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్‌లో ఒకరితోనే ఈ సినిమా ఉండొచ్చు అని టాక్. 2022 తొలి నాళ్లలోనే ఈ విషయం బయటకు వస్తుంది అంటున్నారు. అలాగే పవన్ ప్రొడక్షన్ హౌస్‌లో రామ్‌చరణ్ సినిమా ఉంటుందని అప్పుడెప్పుడో ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆ సినిమా ఇదీ ఒకటేనా అనే డౌట్ కూడా ఉంది. మరి ఆ సినిమా ఏంటి అనేది తెలియడం లేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రావొచ్చు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!