దీపావళికి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్!

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా అనగానే ఆడియెన్స్‌లో భారీ అంచనాలుంటాయి. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ మంచి విజయాలు సాధించడమే అందుకు కారణం. ఇక వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతోన్న తాజా చిత్రం కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. సినిమాను మొదలు పెట్టి నెలలు గడుస్తోన్నా.. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మ్యూజికల్ సర్ప్రైజ్ అంటూ ఒక పాట ని విడుదల చేశారంతే. దీంతో పాటు థీమ్ పోస్టర్ని కూడా విడుదల చేసారు. వాటితో పవన్ అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. అందుకే దసరా నాటికి ఓ టీజర్ ని రిలీజ్ చేద్దామని దర్శకుడు త్రివిక్రమ్ అనుకున్నాడంట. కానీ పవన్-త్రివిక్రమ్ ఇద్దరూ సినిమా షూట్ లో బిజీగా ఉండటంవల్లన.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. అయితే.. దీపావళి కి మాత్రం ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేలా తప్పకుండా టీజర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

డిసెంబర్ ప్రారంభంలోనే సినిమాను పూర్తి చెయ్యాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడట. డిసెంబర్ లోనే పాటలు.. ట్రైలర్ రిలీజ్ కానుండగా.. ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది అని అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేశారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు, సీనియర్ నటి కుష్బూ కీలకరోల్ పోషిస్తోంది. వెంకటేష్ గెస్ట్ రోల్లో సందడి చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus