చిరంజీవి 152 మూవీలో పవన్ కళ్యాణ్!

పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి సినిమా శంకర్ దాదా జిందాబాద్  లో తళుక్కున మెరిశారు. అలా కాకుండా మెగాస్టార్. పవర్ స్టార్ కలిసి నటిస్తే చూడాలని మెగా అభిమానుల ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి కోరిక త్వరలో నెరవేరబోతోంది. అన్నదమ్ములు కలిసి నటించడానికి కథ సిద్ధమవుతోందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమా కోసం గుర్రముపై కత్తి ఫైట్ చేయడాన్ని సాధన చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లో మొదలుకానుంది. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

Click Here

త్రివిక్రమ్ ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయనున్నారు. ఆ మూవీ అయిపోగానే చిరు, పవన్ తో ఓ భారీ సినిమా తీయనున్నట్లు సమాచారం. అది పూర్తిగా చిరంజీవి సినిమా అయినప్పటికీ  అందులో పవన్ కళ్యాణ్ అరగంట పాటు అలరించనున్నట్లు టాక్. ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండుగే పండుగ. చిరంజీవి 152 మూవీ స్క్రిప్ట్ పూర్తి అయిన వెంటనే.. ఆ చిత్ర వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus