పవన్ కళ్యాణ్ లోని రెండు షేడ్స్ చూపించనున్న త్రివిక్రమ్

డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్లుగా అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. సీనియర్ నటి కుష్బూ కీలకరోల్ పోషిస్తోంది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ అనుకుంటున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాని సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో, సాంగ్ బిట్ రిలీజ్ చేశారు. ఇవి చాలా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో పవన్ రోల్ ఒకటే అయినప్పటికీ రెండు షేడ్స్ ఉంటాయని తెలిసింది. కూల్ గా ఉండడమే కాకుండా రఫ్ గా కనిపిస్తారని సమాచారం. పవన్ క్యారక్టర్ ని త్రివిక్రమ్  ప్రత్యేకంగా డిజైన్ చేశారని, ఫ్యాన్స్ కి ఈ రోల్ బాగా నచ్చుతుందని చిత్ర బృందం వెల్లడించింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. జల్సా, అత్తారింటికి దారేది కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus