Bro Movie: వామ్మో.. పవన్ బ్రో మూవీ హక్కుల విలువ అన్ని రూ.కోట్లా?

  • July 7, 2023 / 08:47 PM IST

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ మరికొన్ని వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. బ్రో మూవీ మామా అల్లుళ్ల కాంబినేషన్ లో తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా ఈ మూవీ నుంచి ఒక డైలాగ్ కూడా లీక్ కావడంతో పాటు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. బ్రో మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు చాలాకాలం క్రితమే అమ్ముడవగా థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బ్రో మూవీ ఆంధ్ర హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ హక్కులు 14 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఓవర్సీస్ హక్కులు 13 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నైజాం హక్కులు 33 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు సమాచారం. పవన్ స్ట్రెయిట్ సినిమాలకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగిందో ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో బిజినెస్ జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

మొత్తం 110 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. బ్రో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్రో ట్రైలర్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని తెలుస్తోంది. పవన్ దేవుడిగా సాయితేజ్ భక్తుడిగా మామా అల్లుళ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

బ్రో మూవీ (Bro Movie) ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం బ్రో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus