పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రో మూవీ థియేటర్లలో విడుదలై అబవ్ యావరేజ్ గా నిలిచింది. ఓటీటీలో ఇప్పటికే ఈ సినిమా అందుబాటులో ఉండగా త్వరలో బుల్లితెరపై ఈ సినిమా ప్రసారం కానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా అక్టోబర్ 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు బుల్లితెరపై ఈ సినిమా ప్రసారం కానుంది. బుల్లితెరపై ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రో మూవీ సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలు సైతం భారీ అంచనాలతో తెరకెక్కుతుండగా ఆ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో తెలియాల్సి ఉంది. 2024 ఎన్నికల తర్వాత పవన్ సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో పవన్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల బడ్జెట్లు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. హరిహర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు (Bro Movie) రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేసి ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని కలిగిస్తాయేమో చూడాలి. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని అభిమానులు ఫీలవుతున్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు