Hari Hara Veera Mallu: వీరమల్లు విషయంలో అనుమానాలకు చెక్.. అప్పుడు రిలీజయ్యే ఛాన్స్!

ఈ ఏడాది విడుదల కానున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాలలో హరిహర వీరమల్లు  (Hari Hara Veera Mallu) ఒకటి కాగా ఈ సినిమాకు ప్రస్తుతం జ్యోతికృష్ణ (Jyothi Krishna )  దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా మూడేళ్ల క్రితం ఈ సినిమా మొదలు కాగా నత్తనడకన ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఆగష్టు నెల 14వ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలైందని భోగట్టా. 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్ట్ లతో మూవీ షూట్ జరుగుతోందని తెలుస్తోంది.

Hari Hara Veera Mallu

వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ టార్గెట్ గా తెరకెక్కుతోంది. అయితే డిసెంబర్ నెలలో విడుదల కావడానికి ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  సైతం త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. వీరమల్లు మూవీలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. పవన్ త్వరలో షూటింగ్స్ లో పాల్గొననుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం 2025 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే. బాబీ డియొల్ (Bobby Deol) , అనుపమ్ ఖేర్ (Anupam Kher)   కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటుందేమో చూడాలి.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజున హరిహర వీరమల్లు మూవీ నుంచి అప్ డేట్ తో పాటు రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో సాంగ్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్‌ హీరో.. ఏమన్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus