పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ (OG Movie) సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలెక్కిన విషయం అభిమానులను ఉత్సాహపరిచింది. దర్శకుడు సుజీత్ (Sujeeth) రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో తెరకెక్కుతోంది. గతంలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్‌తో బిజీగా ఉన్న పవన్, ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత ఇటీవల ‘ఓజీ’ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, “అసలైన ఓజీ షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు” అంటూ అభిమానుల్లో సంతోషం నింపారు.
‘ఓజీ’ సినిమా ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. ముంబైతో పాటు పలు నగరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గతంలో వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే, పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ ఆగిపోయింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, పవన్ తాజా షెడ్యూల్‌తో సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. మిగిలిన 25% షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే, మేకర్స్ ముందు ఓ సమస్య ఎదురైందని సమాచారం. అది పవన్ లుక్‌కు సంబంధించినది. గత షెడ్యూల్స్‌లో షూట్ చేసిన సన్నివేశాల్లో పవన్ లుక్‌తో పోలిస్తే, ఇప్పుడు ఆయన ఫిజికల్ లుక్‌లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. రాజకీయ బాధ్యతల కారణంగా ఆయన బాడీ మేకోవర్‌పై దృష్టి పెట్టలేదు, దీంతో అప్పటి లుక్‌తో ఇప్పటి లుక్‌లో సమన్వయం లేకుండా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు మేకర్స్ సీజీఐ, వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవల సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమా విషయంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు, మేకర్స్ సీజీఐ, వీఎఫ్‌ఎక్స్‌తో లుక్‌ను సమన్వయం చేశారు. ‘ఓజీ’ టీమ్ కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు, దీని కోసం శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేయనున్నారు.
‘ఓజీ’ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi ) విలన్‌గా కనిపించనున్నాడు. అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయా రెడ్డి (Sriya Reddy) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ (S.S.Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.