టాలెంటెడ్ డైరెక్టర్ తో ‘ఆహా’ ప్లాన్!

  • December 23, 2020 / 02:57 PM IST

అల్లు వారి ఓటీటీ ‘ఆహా’ కోసం కొత్త కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ సమంతని హోస్ట్ గా పెట్టి ‘సామ్ జామ్’ తో పాటు కొత్త షోలను మొదలుపెట్టాడు. అలానే వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు వెబ్ సిరీస్ లను సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటీనటులు చాలా మంది ఈ వెబ్ సిరీస్ లో భాగస్వాములవుతున్నారు. అయితే ఇప్పుడు ఇతర భాషల వాళ్లనూ కూడా లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

నటి అమలాపాల్.. కన్నడ దర్శకుడు పవన్ కుమార్ కలిసి ‘ఆహా’ కోసం ఓ వెబ్ సిరీస్ ని చేస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ కి ‘కుడి ఎడమైతే’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారట. మొత్తం సిరీస్ లో ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయట. దర్శకుడు పవన్ కుమార్ ‘లూసియా’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తరువాత కన్నడలో ఆయన తెరకెక్కించిన ‘యూటర్న్’ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో సమంత ని హీరోయిన్ గా పెట్టి తీశాడు. ఇక్కడ కూడా సినిమా బాగానే ఆడింది. ఇప్పుడు ఈ దర్శకుడు ‘ఆహా’ కోసం తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తుండడం విశేషం. వీలైనంత తొందరగా ఈ సిరీస్ ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus