పవన్ సినిమాకు బయ్యర్స్ కొరత???

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో మన పవర్ స్టార్ రూటే వేరు….ఆయన ఉన్న క్రేజ్…అభిమాన దళం బహుశా మరే హీరోలకు ఉండరు ఏమో అంటే నమ్మక తప్పని నిజం. అయితే అదే క్రమంలో పవర్ స్టార్ తాజా సినిమా ‘కాటమరాయుడు’అనేక వాయిదాలు పడి రకరకాల సమస్యలతో ఇప్పటికి స్పీడ్  అందుకుంది. ఇక ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు మన పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి అనేక చిక్కుల వల్ల…అనేక కారణాల వల్ల బయ్యర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు….ఇంతకీ ఎందుకు ఈ పరిస్థితి అంటే….ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న విషయాల ప్రకారం…ఇలా బయ్యర్స్ ప్రాబ్లమ్ రావడానికి అసలు కారణం దర్శకుడు డాలీ అని…డాలీ గతంలో పవన్ తో తీసిన ‘గోపాల గోపాల’ మూవీ చెప్పుకో దగ్గ విజయాన్ని సాధించక పోవడంతో పాటు ఈసినిమాకు సంబంధించి దీపావళి రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సరైన రెస్పాన్స్ రాకపోవడంతో బయ్యర్లు ‘కాటమరాయుడు’ గురించి భయపడుతున్నట్లు టాక్.

దీనికితోడు ఈసంవత్సరం అత్యంత భారీ మొత్తాలకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొనుక్కుని తీవ్రంగా నష్టపోయిన బయ్యర్ల కష్టాలకు సంబంధించిన వార్తలు కూడ ‘కాటమరాయుడు’ బయ్యర్ల పై ప్రభావాన్ని చూపెడుతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే బయ్యర్లలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ‘కాటమరాయుడు’ కు సంబంధించి ఒక మంచి టీజర్ ను రూపొందించి త్వరలో విడుదల చేయమని పవన్ ఈసినిమా నిర్మాత శరత్ మరార్ కు అదేవిధంగా ఈ సినిమా దర్శకుడు డాలీకి ఇప్పటికే సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికితోడు ‘కాటమరాయుడు’ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా పవన్ వేలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపద్యం కూడ బయ్యర్లను భయ పెడుతోంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఏది ఏమైనా…పవన్ సినిమాకి ఈ ప్రాబ్లమ్ రావడం కొంచెం ఇబ్బందికర విషయమే…చూడాలి మరి ఏం జరగబోతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus