బెల్లంకొండ శ్రీనివాస్ తో పవన్ హీరోయిన్

Advertisement

పరిశ్రమకి ఎందరో హీరోలు వస్తుంటారు, పోతుంటారు. కానీ.. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. గోల్డెన్ స్పూన్ తో పుట్టడమే కాక నటించే ప్రతి సినిమా 30 కోట్లకి మించిన బడ్జెట్ తో తెరకెక్కడం, ప్రతి సినిమాలో భారీ స్థాయిలో స్టార్ క్యాస్టింగ్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ కి కానీ అల్లు శిరీష్ కి కానీ కెరీర్ కొత్తలో ఇలా జరగలేదు. అలా కంపేర్ చేస్తే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ గ్రాఫ్ మామూలుగా లేదు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న “సాక్ష్యం”లో బాబు సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. మార్చిలో ఈ చిత్రం విడుదలకానుంది.

అయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ అప్పుడే తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. “రాజుగారి గది, రాజుగారి గది 2” చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొన్న ఓంకార్ తన నాలుగో చిత్రంగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా మల్లు బ్యూటీ కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొదటి సినిమాకే సమంత, సెకండ్ సినిమాలో సొనారిక, ఇక మూడో చిత్రంలో రకుల్ తో రొమాన్స్ చేసిన శ్రీనివాస్, నాలుగో సినిమా అయిన “సాక్ష్యం”లో పూజా హెగ్డేతో జోడీ కడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా అయిదో సినిమా కోసం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ తో సయ్యాటాడుతుండడం చర్చనీయాంశం అయ్యింది. అందుకే మనోడ్ని మోస్ట్ లక్కీయస్ట్ హీరో అనేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read