సెక్స్ & కండోమ్ గురించి పబ్లిక్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది

బోల్డ్ సినిమాలు చేయడం మాత్రమే కాదు బోల్డ్ గా మాట్లాడడంలోను తాను ఎప్పుడు ముందు ఉంటాను అంటోంది పాయల్ రాజ్ పుట్. ఆమె మొదటి సినిమా “ఆర్ ఎక్స్ 100″లో ఆమె పోషించిన ఇందు పాత్రను చాలా మంది ప్రేక్షకులు ఇప్పటివరకూ మరువలేదు. ఈలోపే “ఆర్ డి ఎక్స్ లవ్” అనే తీజర్ తో ఇంచుమించు ఆదే స్థాయిలో హల్ చల్ చేసింది పాయల్. ఆ టీజర్ లో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ & శ్రుతి మించిన శృంగార సన్నివేశాలకు జనాలు నోరెళ్ళబెట్టారు. అయితే.. తరువాత విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాలో శృంగారం మాత్రమే కాదు మంచి సందేశం కూడా ఉందని నిరూపించారనుకోండి.

అయితే.. ఈ సినిమా టీజర్ కండోమ్, సేఫ్టీ గురించి మాట్లాడడం ఎందుకు అని పాయల్ ని ప్రశ్నించగా.. ఆమె చాలా సింపుల్ గా “అసలు కండోమ్ గురించి మాట్లాడడంలో తప్పేముంది?. ఒక అపరచిత వ్యక్తితో శృంగారం జరిపేప్పుడు కండోమ్ వాడడం అనేది తప్పనిసరిగా చేసే/చేయాల్సిన విషయం. అలాంటిది కండోమ్, సేఫ్టీ గురించి మాట్లాడడానికి ఏదో తప్పు అన్నట్లుగా ఎందుకు చూస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు అని చెప్పుకొచ్చింది పాయల్. ఆమె చెప్పింది కూడా నిజమే కదా.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus