రామ్ చరణ్ కి నో చెప్పి.. బెల్లంకొండకి ఓకే చెప్పిన పాయల్!

  • September 15, 2018 / 12:33 PM IST

ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాల్లో  “ఆర్‌ఎక్స్ 100” ఒకటి. యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన  ఈ చిత్రం విజయంలో పాయల్ రాజ్ పుత్ భాగం ఎక్కువని సినీ విశ్లేషకులు తేల్చేశారు. ఆమె రొమాన్స్,  పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయని కితాబు ఇచ్చారు. దాంతో పాయల్ రాజ్ పుత్  కి అవకాశాలు వెళ్లువెత్తాయి. అనేక కథలు విన్న పాయల్ భాను శంకర్ చెప్పిన కథ కి ఒకే చెప్పింది. ఆర్ఎక్స్ 100 లో తన పాత్రకు పూర్తిగా భిన్నంగా ఉండే పాత్ర కావడంతో పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యాక్షన్ సన్నివేశాల్లోను నటించనున్నట్లు టాక్. ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదంతా బాగానే ఉంది గానీ ఈ భామని… బోయపాటి శ్రీను తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమని అడిగారు.

రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే పూజా హెగ్డే కూడా ఎగిరి గంతేసి ఒప్పుకుంది. అటువంటిది పాయల్ మాత్రం నో చెప్పింది. కేవలం హీరోయిన్ రోల్ మాత్రమే చేస్తానని చెప్పింది. ఆమె నిర్ణయానికి అందరూ విలువిచ్చారు. కానీ ఇప్పుడు తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒకే చెప్పినట్లు సమాచారం. అది తెలుసుకున్న మెగా అభిమానులు హర్ట్  అయ్యారు. తమ హీరో సినిమాలో  ఐటెం సాంగ్ కి నో చెప్పి.. ఇప్పుడు బెల్లంకొండ తో చిందులేయడానికి ఒప్పుకుంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus