రామ్ చరణ్ సరసన నటించే అవకాశాన్ని వద్దనేసింది

  • August 21, 2018 / 01:06 PM IST

బాలీవుడ్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుట్ “ఆర్ ఎక్స్ 100” సినిమాతో తెలుగు ప్రేక్షకులని మాత్రమే కాదు యువత మొత్తాన్ని తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకొంది. దాంతో అమ్మడికి సాధారణంగానే ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తేజ-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశంతోపాటు.. అఖిల్ మూడో సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం కూడా అమ్మడిని వెతుక్కుంటూ రాగా.. చేస్తే లీడ్ రోల్ లోనే నటిస్తాను అంటూ వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. వాళ్ళంటే యంగ్ హీరోస్ కాబట్టి అమ్మడు కాదంది అంటే ఒక కారణం ఉందనుకోవచ్చు కానీ.. ఏకంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఒక ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశం వెతుక్కుంటూ రాగా.. అమ్మడు చాలా సింపుల్ గా నో చెప్పేసిందట.

కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో నటిస్తుంటే పాయల్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. ఇలాంటి పాత్రలే కావాలని పట్టుబట్టి కూర్చుంటే మాత్రం పాయల్ కి టాలీవుడ్ లో అవకాశాలు కష్టమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి పాయల్ చేతిలో నిర్మాత సి.కళ్యాణ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus