Payal Rajput: పాయల్ రాజ్ పుత్ కోరికను మహేష్ బాబు నెరవేర్చడం సాధ్యమవుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరో అయ్యే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆర్.ఎక్స్100 సినిమా తర్వాత పాయల్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా పాయల్ కు భారీ సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాయల్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కథ నాకు సూట్ అవుతుందా? లేదా? అనే విషయం తెలుసుకుని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని పాయల్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒడిదొడుకులను ఎదుర్కొని ముందుకు సాగాలని పాయల్ రాజ్ పుత్ వెల్లడించారు.

స్టార్ హీరో వెంకటేశ్ కు జోడీగా నటించడం నా అదృష్టం అని పాయల్ రాజ్ పుత్ పేర్కొన్నారు. సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండేదని నేను అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందని పాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ హీరో మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టమని పాయల్ రాజ్ పుత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహేష్ బాబుకు జోడీగా నటించాలని నా కోరిక అని (Payal Rajput) పాయల్ రాజ్ పుత్ వెల్లడించారు. మహేష్ బాబు పాయల్ రాజ్ పుత్ కు రాబోయే రోజుల్లో ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. మహేష్ బాబు రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. స్టార్ హీరో మహేష్ బాబు వచ్చే ఏడాది నుంచి రాజమౌళి షూటింగ్ తో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus