పాయల్ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా?

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది నార్త్ ఇండియన్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌. మొదటి చిత్రంతోనే సక్సెస్ అందుకోవడం మాత్రమే కాదు తన గ్లామర్ తోనూ నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం రవితేజ తో ‘డిస్కో రాజా’ అలాగే వెంకటేష్ తో ‘వెంకీమామ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే తన సోషల్ మీడియాలో కూడా… తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారుని హీటెక్కిస్తుంటుంది.

తాజాగా పాయల్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె ఓ వ్యక్తి పక్కన కూర్చొని ఉంది. ఈ ఫోటోకి మూడు ప్రేమ గుర్తులను కూడా జత చేసింది. అంతే ‘ఈ ఫోటోలో ఉంది కచ్చితంగా పాయల్ బాయ్ ఫ్రెండే’ అంటూ నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. పైగా మరో నటి అలాగే పాయల్ స్నేహితురాలు అయిన అర్చనా గుప్తా ‘మై ఫేవరెట్ లవ్ బర్డ్స్’ అని కామెంట్ పెట్టడం…. దానికి పాయల్ ప్రేమ గుర్తులతో బదులివ్వడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. అతను పాయల్ బాయ్ ఫ్రెండ్ అనే విషయం కన్ఫర్మ్ అయిపోయిందని మరిన్ని కామెంట్లు పెడుతున్నారు. పాయల్ మాత్రం.. స్పందించకపోగా… ఎక్కువగా కనిపించకుండా కొన్ని కామెంట్లని హైడ్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సౌరభ్ అని తెలుస్తుంది. ఇతను పలు పంజాబీ ధారావాహికల్లో పాయల్ తో కలిసి నటించాడట. అదే సమయంలోనే ఒకర్నొకరు ఇష్టపడ్డారని.. అది కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తుంది. మరి ఈ విషయం నిజమో.. కాదో… పాయల్‌ స్పందిస్తేనే కానీ చెప్పలేం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus