Digangana Suryavanshi: హీరోయిన్ దిగంగన సూర్య వంశీ పై నెమలి దాడి .. వీడియో వైరల్..!

  • April 12, 2021 / 12:41 PM IST

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పై నెమలి దాడి చెయ్యడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘హిప్పీ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిగంగన సూర్య వంశీ. తరువాత ఈమె ‘వలయం’ అనే చిత్రంలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినా.. ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

అలాగే స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారుతూ చేస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇదిలా ఉండగా.. ఈమె పైనే తాజాగా నెమలి దాడి చేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. జాతీయ పక్షి అయిన నెమలి అంటే దిగంగన కు చాలా ఇష్టం. దానిని మొదటిసారి దగ్గరి నుండీ చూసే అవకాశం రావడం వల్ల.. ఉత్సాహంతో దగ్గరకు వెళ్ళింది. అప్పటివరకూ నెమలి సైలెంట్ గానే ఉంది. కానీ తరువాత ఊహించని విధంగా..

ఆమె పైకి ఎగిరి దాడి చేసింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ దిగంగన చేతికి చిన్న గాయాలు అయ్యాయి. మొన్నటికి మొన్న శ్రీయ పై కూడా ఓ జంతువు సడెన్ గా దాడి చెయ్యడానికి దూసుకురాగా ఆమె వెంటనే అప్రమత్తమయ్యి పక్కకు తప్పుకుంది. దాంతో ఆమె పెద్ద ప్రమాదం నుండీ బయటపడిందనే చెప్పాలి. ఈసారి దిగంగన సూర్యవంశీ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవ్వడం గమనార్హం.


‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus