ఈ మధ్య అనే కాదు.. సినిమా మొదలుపెట్టి.. రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుండి ఇటు మెగా ఫ్యాన్స్.. అటు క్రిటిక్స్ నుండి వినిపిస్తున్న మాట ‘ఈ సినిమా ‘రంగస్థలం’ సినిమాను మించి ఉంటుంది’ అని. దానికి కారణం సినిమా నేపథ్యం, చరణ్ లుక్, దర్శకుడి బ్యాగ్రౌండ్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ‘పెద్ది’ సినిమాను ఏ సినిమాను ఢీ కొట్టడానికి రెడీ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఆ సినిమా సెట్‌లోనే అంతా జరిగిందట. ఈ విషయాన్ని సినిమా నిర్మాత వెంకట సతీశ్ కిలారు చెప్పారు.
వృద్ధి సినిమాస్ పేరుతో ఓ సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చారు వెంకట సతీశ్ కిలారు. అంతకుముందు ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితులు అని సమాచారం. ఆ అనుబంధంతోనే ఏమో ఓ రోజు ఆ సినిమా సెట్‌లో రామ్‌చరణ్ – వెంకట సతీశ్ కిలారు మాట్లాడుకుంటున్నప్పుడు ‘మాకో సినిమా చేయాలి’ అని వెంకట సతీశ్ కిలారు అడిగారట. దానికి చరణ్ తప్పకుండా చేస్తానని చెప్పారట. అలా ఆ రోజు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ‘పెద్ది’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారని నిర్మాత చెప్పారు.
తాను తలచుకుంటే అయ్యే సినిమా ‘పెద్ది’ కాదని.. రామ్ చరణ్ అవకాశం ఇవ్వడంతోనే ఈ సినిమా అయిందని చెప్పారు. ఈ సినిమాకి ఓ గొప్ప టీమ్ కుదిరిందని చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరక్టర్ ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరక్టర్ అవినాశ్ కొల్లా ఇలా అందరూ అద్భుతంగా కుదిరారు అని చెప్పారు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, టినూ ఆనంద్ బాగా కుదిరారు అని చెప్పారు.
తక్కువ సినిమాలైనా సరే, మంచి సినిమాలే చేయాలన్నది తన తపన అని వెంకట సతీశ్ కిలారు చెప్పారు. వ్యవసాయం కుటుంబం నుండి వచ్చినవాడిని అని తన బ్యాగ్రౌండ్ చెప్పారు. ఇక ఆయన రెండో సినిమాగా బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబో రిపీట్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.3