Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

అందరూ వినాయక చవితి జరుపుకుంటే.. ‘పెద్ది’ టీమ్‌ మాత్రం పెద్దగా ప్లాన్‌ చేసిన సాంగ్‌ షూటింగ్‌లో బిజీగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియా పోస్టు ఈ విషయాన్నే తెలియజేస్తోంది. గణేశ్‌ చతుర్థి సందర్భంగా ‘పెద్ది’ సినిమా టీమ్‌ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో విషెష్‌ చెప్పడంతోపాటు.. ఓ పాట షూటింగ్‌ అవుతోంది అనే అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. టీమ్‌ చెప్పినట్లే భారీగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది అని సమాచారం.

Peddi Song

‘పెద్ది’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కర్ణాటకలో మైసూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లతో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. రెహమాన్‌ డప్పు… రామ్‌చరణ్‌ స్టెప్పు అదిరిపోతాయంటూ బుచ్చిబాబు సానా సోషల్‌ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ఈ పాటకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సినిమా టీమ్‌ రిలీజ్‌ చేసిన విషెస్‌ వీడియోలో జానీ మాస్టర్‌ కూడా కనిపించారు. వివాదాల తర్వాత చరణ్‌తో కలసి జానీ మాస్టర్‌ కొరియో చేసిన తొలి సినిమా ఇది.

ఇక ఈ సినిమా గురించి చూస్తే.. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ఇది. ఇందులో చరణ్‌ ఆట కూలీగా కనిపిస్తాడని సమాచారం. అంటే అన్ని ఆటలూ వచ్చినా.. అవసరానికి తగ్గట్టు ఆడుతుంటాడు. దీని వెనుక ఓ కారణం ఉంటుందని, క్లైమాక్స్‌లో తనకు ఇష్టమైన ఆట ఆడతాడని.. అదెందుకు అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది అని అంటున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పిస్తున్నాయి. ఇక ఈ సినిమాను రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేస్తున్నారు.

పర్వాలేదనిపించిన ‘సుందరకాండ’ ఫస్ట్ డే కలెక్షన్స్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus