Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘నువ్విలా’ వంటి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తర్వాత అతను హీరోగా మారి ‘పెళ్ళిచూపులు’ అనే సినిమా చేశాడు.  తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ఇది. ప్రియదర్శి కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను ‘బిగ్ బెన్ సినిమాస్’ ‘ధర్మపథ క్రియేషన్స్’ బ్యానర్లపై రాజ్ కందుకూరితో కలిసి విజయ్ దేవరకొండ మావయ్య యష్ రంగినేని నిర్మించారు.

Pelli Choopulu Collections

‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా… ఓవర్సీస్లో  ‘ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలిమ్స్’ సంస్థ రిలీజ్ చేసింది.పెద్దగా అంచనాలు లేకుండా 2016 వ సంవత్సరం జూలై 29న రిలీజ్ అయ్యింది ‘పెళ్ళిచూపులు’. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలాగే 2 నేషనల్ అవార్డులు కూడా అందుకుంది. ‘పెళ్ళిచూపులు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

 

నైజాం 5.30 cr
సీడెడ్ 0.70 cr
ఉత్తరాంధ్ర 0.75 cr
ఈస్ట్ 0.58 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు 0.62 cr
కృష్ణా 0.90 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ+తెలంగాణ 9.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.94 cr
ఓవర్సీస్ 4.49 cr
వరల్డ్ టోటల్ 9.46 cr

 

‘పెళ్ళి చూపులు’ చిత్రం రూ.1.57 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యింది. కానీ రెండో వారానికి థియేటర్స్ పెరిగాయి. ఆ తర్వాత వసూళ్లు కూడా పెరిగాయి.ఫుల్ రన్లో ఎవ్వరూ ఊహించని విధంగా రూ.15.73 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం. బయ్యర్లకు టోటల్ గా రూ.14.16 కోట్ల భారీ లాభాలు అందించి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus