‘మర్రి చెట్టు నీడలో దాని పిల్ల మొక్కలు కూడా బ్రతకవు’ అనేది పెద్దలు చెప్పే మాట. కానీ అది నిజం కాదు అని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకరు దుల్కర్ సల్మాన్. అవును..! అతని తండ్రి మమ్ముట్టి పెద్ద స్టార్ హీరో. ఇప్పటికీ ఆయన సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నారు. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్. మొదట్లో దుల్కర్ సల్మాన్ హీరోగా నిలబడడానికి చాలా కష్టపడ్డాడు. నిలబడడానికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డాడు.
ఏడాదికి 5,6 సినిమాలు చేస్తూ ఎంతో మంది స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ‘సీతా రామం’ ‘లక్కీ భాస్కర్’ వంటి క్లాసిక్స్ కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి. నిన్న దుల్కర్ పుట్టినరోజు కావడంతో అతని కొత్త సినిమాలకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ వదిలారు. ‘కాంత’ ‘ఆకాశంలో ఒక తార’ దుల్కర్ నుండి రాబోతున్న కొత్త సినిమాలు. వీటి ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. కానీ అందరిలో ఒక డౌట్ ఏర్పడింది.
‘దుల్కర్ మరీ రొటీన్ అయిపోతున్నాడేంటి’ అని..! కొన్నాళ్లుగా చూసుకుంటే అతను ఎక్కువగా పీరియాడిక్ సినిమాలే చేస్తున్నాడు. ‘మహానటి’ నుండి చూసుకుంటే ‘కింగ్ ఆఫ్ కోత’ ‘కురుప్’ … ఇలా ‘కాంత’ వరకు పీరియాడిక్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వీటి పోస్టర్స్ లో దుల్కర్ లుక్ ను సెపరేట్ చేసి చూస్తే ఏది ఏ సినిమాలోదో చెప్పడం కష్టం. ‘కనులు కనులను దోచాయంటే’ బాగా ఆడింది. అలాంటి న్యూ ఏజ్ కమర్షియల్ సినిమాలు చేయడం దుల్కర్ తగ్గించేశాడా.? లేక దర్శకులే అతన్ని అలా ట్యూన్ చేసేస్తున్నారా? అనేది అర్థం కాని ప్రశ్న. కానీ ఎక్కువగా ఇలాంటివే చేస్తే మాత్రం దుల్కర్ ఫాలోయింగ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.