హీరో నాని ద్వారా రిలీజ్ అయిన శ్రీవత్స క్రియేషన్స్ , ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చిగ నచ్చిందని మంచు లక్ష్మీ చెప్పారు . వినాయక చవితి సందర్బంగా పిచ్చిగ నచ్చావ్ సినిమాలోని హీరోలలో ఒకరైన సంజీవ్ ఫస్ట్ లుక్ ను మంచు లక్ష్మీ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగ లక్ష్మీ గారు మాట్లాడుతూ హీరో ఫస్ట్ లుక్, మూవీ ఫస్ట్ లాగానే చాలా బాగుందని చెప్తూ ఎంటైర్ యూనిట్ కు విషెష్ చెప్పారు . ఫస్ట్ లుక్ తోనే ఒకరకమయిన పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తూ , సినిమాపై అంచనాలు పెంచుతున్న సినిమా శశిభూషణ్ డైరెక్షన్లో కమల్ కుమార్ పెండెం నిర్మిస్తున్నాడు . సినిమాలో సంజీవ్ తో పాటు నందు మరో లీడ్ చేస్తుండగా ,కామెడీ ఆర్టిస్ట్ ఉత్తేజ్ గారి డాటర్ చేతన ఉత్తేజ్ , కారుణ్య ఫిమేల్ లీడ్ చేస్తున్నారు . చేతనకు ఇది ఫస్ట్ మూవీ . నాని లాగానే అడగ్గానే హీరో సంజీవ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకొని , వినాయక చవితి రోజు రిలీజ్ చేసిన మంచు లక్శ్మి కు నిర్మాత థాంక్స్ చెప్పారు. పోస్టు ప్రొడక్షన్ ఫినిషింగ్ స్టేజి లో ఉన్న సినిమాకి వెంకట హనుమ సినిమాటోగ్రఫీ , మ్యుజిక్ రామ్ నారాయణ్ చేస్తుండగా పుచ్ఛా రామకృష్ణ ప్రొడక్షన్ కంట్రోలర్ గా వ్యవహరిస్తున్నాడు.
Hero Chandu charecter reveal
హాయ్ .. నేను చందు . సింగల్ గా వుంటూ లైఫ్ ను టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకుంటూ, నాకున్న ఫ్రెండ్స్ తో వీలు ఉన్నప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నా …ఆలా అని పని పాటా లేని వాణ్ని కాదండోయ్ .. నేను బానే సంపాదిస్తున్నా .ఎలా అన్నది మాత్రం సినిమా రిలీజ్ వరకు సస్పెన్సే ..ప్లీజ్ అర్థం చేసుకోండి . సిక్స్ అవర్స్ వర్క్ టెన్ అవర్స్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ తో 20-20 మ్యాచ్ లా చాలా స్పీడ్ గా సాగుతున్న నా లైఫ్ లోకి లావణ్య ఎంటర్ అయ్యింది . పేరుకు తగ్గట్టే అందంగా వున్న తను మొదట్లో నన్ను పట్టించుకోకున్నా తర్వాత మన గురించి తెలుసుకొని క్లోజ్ గా మూవ్ అయింది . ఇంకేముంది మన ఆనందానికి బోర్డర్ లేదు. తనకు ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను .. యిక్కడే నాకు షాక్ .. మతి పోయింది నాకు ..అలా అని తనకొక బాయ్ ఫ్రెండ్ లాంటి రెగ్యులర్ ట్విస్ట్ లేదండి .. అదో డిఫరెంట్ సిట్యుయేషన్ .. సినిమా చూశాక మీరు నిజం అంటారు . నన్ను, లావణ్యను ఒకటి చేయాలని ఫ్రెండ్స్ పట్టు బట్టారు . ఆ తరువాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏ అబ్బాయి చేయని , చేయకూడని బ్లండర్ మిస్టేక్ చేశాను ..లైప్ లో దిద్దుకోలేని పెద్ద తప్పు చేశాను .దాని రిజల్ట్ ..ఒకవైపు కెరీర్ , మరోవైపు లవ్ రెండు నాకు దూరమయ్యాయి ..ప్చ్ ..ఏమి చేస్తాము …అన్ని మన హాండ్స్ లో వుండవు . ఫ్రెండ్స్ నేను పేస్ చేసిన దాన్నిబట్టి మీకు చెప్పేది ఒకటే అందరితో అన్ని షేర్ చేసుకోవడానికి ఫీలింగ్స్ అనేవి పబ్లిక్ ప్రాపర్టీ కాదు ..అవి కొద్దిమందికే సంబంధించినవి .. సినిమా చూస్తే మీరుకూడా అవును అంటారు .. చూస్తారుగా ..మీ చందు.