‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తాజాగా విడుదలయ్యి హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఓ చిన్న చిత్రం తీస్తేనే వర్మ దానిని ఓ రేంజ్లో ప్రమోషన్ చేస్తుంటాడు. అయితే గతంలో ‘రక్త చరిత్ర 2’ ‘బెజవాడ’ ‘వంగవీటి’ వంటి చిత్రాలను అలాగే భారీ స్థాయిలో ప్రమోట్ చేసాడు. మొదటి షో కి జనాలంతా క్యూలు కట్టి పరిగెత్తారు. అయితే ఆ సినిమాల్లో వాస్తవాలని పక్కన పెట్టేసి… కల్పితాలని ఎక్కువ మిక్స్ చేసేసి.. ప్రేక్షకులకి బిస్కట్ వేసేశాడు. అయితే ఈసారి పెద్దాయన.. మాజీ ముఖ్యమంత్రి. టి.డి.పి వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ అసలు బయోపిక్ నేను తీస్తున్నాను అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదలు పెట్టాడు. అయితే వర్మ గురించి తెలుసుకున్న ప్రేక్షకులు మొదట్లో పెద్దగా ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదు.
కానీ బాలకృష్ణ రూపొందించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ డిజాస్టర్ అవ్వడం… అందులో మిస్సయిన నిజాల్ని నేను చూపిస్తానని చెప్పినా జనాలు నమ్మలేదు. ఇదిలా ఉంటే చంద్రబాబు తో సహా టి.డి.పి నాయకులు కూడా ఈ చిత్రాన్ని ఆపేయాలని తెగ ప్రయత్నించడం… వర్మ ఏమాత్రం తగ్గకుండా మీడియాకి ఎక్కి వారికీ కౌంటర్లు ఇవ్వడం గట్టి ప్రచారం మొదలైంది. ఈ చిత్రాన్ని ఆపేయాలని టి.డి.పి ప్రభుత్వం ఎందుకు అంతలా ప్రయత్నిస్తుంది… రిలీజ్ ఆపేస్తే యూట్యూబ్ లో విడుదల చేస్తాను అనే వర్మ కామెంట్ ను పట్టుకుని థియేటర్లలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ చిత్రాన్ని ఆపేయాలని ఎందుకు అంత గట్టిగా ప్రత్నిస్తుంది అని జనాల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ చిత్రాన్ని వర్మ కంటే టి.డి.పి ప్రభుత్వమే ఎక్కువ ప్రమోట్ చేసింది.
విడుదల ఆపేస్తే.. ఏమైంది.. యూట్యూబ్ లో విడుదల కాకపోతే ఏమైంది… ? పైరసీ బ్రదర్స్ ఉన్నారు కథా..! యూ.ఎస్ లో అలా షో పడిందో లేదో ఇలా ప్రింట్ బయటకి వచ్చేయడం… ఇంటర్నెట్ లో దానిని అప్లోడ్ చేసేయడం వంటివి జరిగిపోతున్నాయట. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో సినిమా విడుదలైతే.. ఫ్యామిలిలో ఒక్కరో లేక ఇద్దరో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసేవారేమో… కానీ ఇలా పైరసీ బయటికి రావడం… ఏపీలో ఉండే ఫ్యామిలీస్ మొత్తం ఈ సినిమా కచ్చితంగా చూసే అవకాశం ఏర్పడింది. అందులోనూ యూ.ఎస్ లో ఈ చిత్రాన్ని ఇక్కడ మనకి సెన్సార్ కట్ అయిన డైలాగులు కూడా ఉన్నాయట. ఇలా టి.డి.పి ప్రభుత్వమే వర్మ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసిందని చెప్పాలి. అయితే ఏపీ లో ఈ చిత్రం విడుదల కాకపోవడం నిర్మాతలకి కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ ఈ చిత్రం ఏపీ లో విడుదలవ్వకుండానే బ్రేక్ ఈవెన్ అయిపోయేలా ఉందని కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.