Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • September 13, 2026 / 10:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’(Pithapuram Lo Ala Modalaind). ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు.

Pithapuram Lo Ala Modalaindi

pitapuramlo

ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

సుమన్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను.’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ యోగ్యుడైన దర్శకుడు. ఆయన మంచి వ్యక్తి. ఈ చిత్రంతో చంద్ర మహేష్‌కి మంచి విజయం దక్కాలి. చంద్ర మహేష్ నిర్మాతల డైరెక్టర్. ఇలాంటి ఉత్తమ దర్శకుడు మరిన్ని సినిమాల్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను. చైతన్య రెడ్డి గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘‘చంద్ర మహేష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని నిర్మించిన దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలకు మంచి లాభాలు దక్కాలి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం. ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది. చంద్ర మహేష్ ఎలాంటి దర్శకుడో నాకు ముందు నుంచీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు తను. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో వుండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ వుంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో వున్నాయి. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దణ్ణంపెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి’’ అన్నారు.

తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనంత గిరి మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అని టైటిల్ చూసినప్పుడే సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. మంచి సినిమాల్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుంది’ అని అన్నారు.

దర్శకుడు రాం ప్రసాద్ మాట్లాడుతూ .. ‘’పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రాబోతోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న విడుదలవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమ, పెళ్లిళ్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ నాకు మంచి మిత్రుడు. ప్రస్తుతం ఉన్న తరానికి నచ్చేలా సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం థియేటర్‌లకు ఆడియెన్స్ వస్తున్నారు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని మీడియా సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రంలో తండ్రీ, కూతుళ్ల మధ్య రిలేషన్‌ను అద్భుతంగా చూపించారు. అనుభవం ఉన్న వారు చెప్పే సలహాల్ని పిల్లలు పాటించాలి. చిన్న నిర్మాతలకు, కొత్త వారికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం’ అని అన్నారు.

దర్శక రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘ప్రేమలు, పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ ఉన్నంత వరకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ ఉంటుంది. తండ్రీకి, కూతురికి జరిగే అద్భుతమైన సంఘర్షణ ఇందులో ఉంటుంది. మహేష్ చంద్ర గారు డ్రామాను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. ఈ సినిమాని అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతీ తల్లి, తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా’ అని అన్నారు.

నిర్మాత ఆకుల సురేష్ మాట్లాడుతూ .. ‘నా ఊర్లో నేను ఎన్నో కుటుంబాల్ని చూసి ఈ కథను రాసుకున్నాను. చంద్ర మహేష్ గారికి ఈ కథను వినిపించాను. ఇప్పుడు నా కథ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అంటూ రాబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం నచ్చుతుంది. ప్రతీ కుటుంబంలో జరిగే కథలా ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత ఎఫ్.ఎం. మురళీ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ గారు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మా ఊర్లో, మా ఇంట్లో షూట్ చేశారు. సినిమా చూసి భావోద్వేగంతో బయటకు వచ్చాను. యూత్‌కి, ఫ్యామిలీకి ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.

నటి మణిచందన మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రంలో మంచి కథ, మంచి ఎమోషన్ ఉంటుంది. నాకు ఈ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చిన మహేష్ చంద్ర గారికి థాంక్స్’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ .. ‘మహేష్ చంద్ర గారే నన్ను ఆర్టిస్టుగా పరిచయం చేశారు. మా గురురు గారు తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, మణిచందన గారు నటించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం గురించి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో గొప్పగా చెప్పారు. ఎన్నో విలువలతో తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. అందరూ ఈ సినిమాని అందరూ థియేటర్లో చూడాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు పృథ్వీ మాట్లాడుతూ .. ‘మహేష్ చంద్ర గారు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’లో అద్భుతమైన కథను చూపించబోతోన్నారు. తండ్రీ, కూతుళ్లు బంధాన్ని గొప్పగా రాసుకున్నారు. తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఇంకా ఉన్నారు. అలాంటి కూతురు నాకు ఉండటం నా అదృష్టం. ప్రతీ కుటుంబంలో జరిగే కథ ఇది. క్లైమాక్స్‌కి అందరూ కచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు’ అని అన్నారు.

నటుడు కేదార్ శంకర్ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.

నటి శ్రీలు మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న రాబోతోంది. ప్రతీ ఫ్యామిలీ.. తల్లీ, తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా’ అని అన్నారు.

నటుడు విరాట్ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో అవకాశం ఇచ్చిన మహేష్ చంద్ర గారికి థాంక్స్. ఇది నా తొలి సినిమా. ఈ రోజు మాకోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నటుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రంలో అవకాశం ఇచ్చిన చంద్ర మహేష్ గారికి థాంక్స్. సెప్టెంబర్ 18న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

12 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

51 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version