సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్లనున్న పవన్, త్రివిక్రమ్ బృందం

డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడవ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. “రాజు వచ్చినాడు” అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లపై సాగింది. ఆ తర్వాత అమీర్ పేట్ లోని సారధి స్టూడియోలో పవన్, వెంకటేష్ లపై సరదా సన్నివేశాన్ని తెరకెక్కించారు. కొన్ని రోజులుగా శంషాబాద్ దగ్గర ఓ పెద్ద భవనంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ బృందం యూరప్ ట్రిప్ ప్లాన్ చేసింది.

పవన్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) తర్వాత ఈ షెడ్యూల్ మొదలు కానుంది. అక్కడ అందమైన లొకేషన్లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో అలనాటి హీరోయిన్స్  కుష్బూ, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus