The Warriorr Movie: ‘ది వారియర్’ కి డివైడ్ టాక్ రావడానికి ఈ మైనస్ లే కారణమా?

  • July 14, 2022 / 09:17 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’. ఈరోజు అంటే జూలై 14 న విడుదలైన ఈ మూవీకి డివైడ్ టాక్ వస్తుంది. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు. మరికొంతమంది ‘అంత లేదు’ అంటున్నారు. ‘వారియర్’ తో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు హీరో రామ్. అంతేకాదు తన కెరీర్లో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. చాక్లెట్ బాయ్ లాంటి రామ్.. పోలీస్ పాత్ర చేస్తే సెట్ అవుతుందా అని.. మొదట అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో అవి పటాపంచలు అయిపోయాయి. ఈ సినిమా కోసం రామ్ ఎన్నో వర్కౌట్లు చేసి బాడీని పెంచాడు. సరే ఇక అసలు ‘ది వారియర్’ కు డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది? డివైడ్ టాక్ అన్నంత మాత్రాన తీసిపారేసే సినిమా అని కాదు. ఇందులో ప్లస్ లు ఎన్ని ఉన్నాయో మైనస్ లు కూడా సమానంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ప్లస్సులు :

1) ‘ఇస్మార్ట్ శంకర్’ తో రామ్ కు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అది ‘ది వారియర్’ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో రామ్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో సత్య ఎం.బి.బి.ఎస్ గా(డాక్టర్ గా).. సాఫ్ట్ గా కనిపిస్తే, సెకండ్ హాఫ్ లో సత్య ఐ.పి.ఎస్ గా( పోలీస్ గా) మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు అనో ఏమో కాదు ఈ సినిమా కోసం రామ్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం స్క్రీన్ పై పుష్కలంగా కనిపిస్తుంది.

2) విలన్ గా గురు పాత్రలో ఆది లుక్ కానీ, మేనరిజమ్స్ కానీ అదిరిపోయాయి. ఇతని పాత్రలకి అతను కేరాఫ్ అడ్రస్ అని ప్రూవ్ చేశాడు. ఇతని పాత్ర మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

3) కృతి శెట్టి లుక్స్ బాగున్నాయి. విజిల్ మహాలక్ష్మీ గా చాలా క్యూట్ గా నటించింది.

 

4) సినిమా స్టైలిష్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాస్ సినిమాలో ఎలా ఉండాలో అలా ఉంది.

5) గురు(విలన్ ఆది) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. అతని క్యారెక్టర్ ను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు.

6) సెకండ్ హాఫ్ లో రామ్ పోలీస్ స్టేషన్ లో ఎంట్రీ ఇచ్చే సీన్ అలాగే హీరోయిన్ ని కిడ్నాప్ చేసే సీన్ కొత్తగా.. ఆకట్టుకునే విధంగా ఉంది.

7) పాటలు చూడటానికి బాగున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్, దడ దడ సాంగ్ పిక్చరైజేషన్.. అందులో రామ్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఆకట్టుకుంటాయి

మైనస్ ల విషయానికి వస్తే :

8) కథ ఏ మాత్రం కొత్తగా ఉండదు. మా సన్నివేశాలతో సినిమాని నడిపించేద్దాం అని యాక్షన్ బ్లాక్స్ రాసుకున్నాడు దర్శకుడు.

9) ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా పోసాని కామెడీ ట్రాక్ అతికినట్టు ఉంటుంది.

10) ఫస్ట్ హాఫ్ లో విలన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్ని వర్కౌట్లు చేసినా ఎందుకో ఆది కటౌట్ ముందు రామ్.. వీక్ గా కనిపిస్తాడు.

11) ఇక ఫస్ట్ హాఫ్ లో రామ్ ను.. విలన్ ఆది చితక్కొట్టి కొండారెడ్డి బురుజు కి వేలాడదీసే సీన్ రామ్ అభిమానులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెడుతుంది. దర్శకుడు ఈ సీన్ ను తమిళ ప్రేక్షకుల సంతృప్తి కొరకు డిజైన్ చేసుకున్నట్టు ఉన్నాడు.

 

 

12) క్లైమాక్స్ లో హీరోయిన్ కి యాక్సిడెంట్ అవ్వడం.. ఇక ఆమె మాట్లాడలేదు అని డాక్టర్లు చెప్పడం.. లాస్ట్ సీన్ లో మళ్ళీ హీరోయిన్ విజిల్ వేస్తూ కనిపించడం.. ల్యాగ్ అనిపిస్తుంది. ఎమోషనల్ గా కూడా ఆ సీన్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు.

13) దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇలాంటి సినిమాలకు నేపధ్య సంగీతం బాగా కుదరాలి. కానీ దేవి మాత్రం డప్పులు వాయించేసి చేతులు దులిపేసుకున్నాడు.

14) బ్రహ్మాజీ పాత్ర ఇంకా బాగా డిజైన్ చేస్తే బాగుండేది. కానీ మొదట్లో నెగిటివ్ గా చూపించి తర్వాత పాజిటివ్ గా చేసేసి మమ అనిపించేశారు. అందుకు స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది.

15) బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అక్కడక్కడ మెరిసాయి తప్ప.. సంభాషణలు ఇంట్రెస్టింగ్ గా లేవు. తమిళ కమెడియన్ రెడిన్ కింగ్ స్లే ని టీజర్ లో హైలెట్ చేశారు కానీ సినిమాలో అతని కామెడీ ట్రాక్ సింపుల్ గా లేపేశారు.

Click Here For Movie Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus