‘పొగరు’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • February 20, 2021 / 03:34 PM IST

చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు.. రష్మిక పేరు చెప్పుకుని కన్నడ డబ్బింగ్ చిత్రమైన ‘పొగరు’ని తెలుగు రాష్ట్రాల్లో బాగానే అమ్మేసారు. అర్జున్ మేనల్లుడు అయిన ధృవ్ షార్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నంద కిషోర్ డైరెక్ట్ చెయ్యగా.. డి.ప్ర‌తాప్ నిర్మించారు.చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్యలు సంగీతం సమకూర్చారు. ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట.. ఈ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది. కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం వాటిని ఏమీ మ్యాచ్ చెయ్యలేకపోయింది.

ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   0.29 cr
సీడెడ్   0.17 cr
ఉత్తరాంధ్ర   0.12 cr
ఈస్ట్   0.05 cr
వెస్ట్   0.03 cr
గుంటూరు   0.05 cr
కృష్ణా   0.04 cr
నెల్లూరు   0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   0.78 cr

‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రం 0.78 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 3.42 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus