‘పొగరు’ 4 డేస్ కలెక్షన్స్..!

  • February 23, 2021 / 04:04 PM IST

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా హీరోగా నంద కిషోర్ డైరెక్షన్లో.. డి.ప్ర‌తాప్ నిర్మించిన తాజా చిత్రం ‘పొగరు’.చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్యలు సంగీతంలో రూపొందిన ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట.. ఈ డబ్బింగ్ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది. కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి. అయినప్పటికీ రష్మిక వంటి స్టార్ హీరోయిన్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసింది.

ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం   0.69 cr
సీడెడ్   0.44 cr
ఉత్తరాంధ్ర   0.29 cr
ఈస్ట్   0.13 cr
వెస్ట్   0.08 cr
గుంటూరు   0.11 cr
కృష్ణా   0.12 cr
నెల్లూరు   0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   1.93 cr

‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.93 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.27 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ ఓపెనింగ్స్ చాలా ఎక్కువే. కానీ బయ్యర్లు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారు కాబట్టి.. వీక్ డేస్ లో సో సోగా పెర్ఫార్మ్ చేస్తే కుదరదు మరి.సోమవారం రోజున పర్వాలేదు అనిపించినప్పటికీ.. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి కష్టమనే చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus