Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

మెగాస్టార్ చిరంజీవికి 2 కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు జయంత్ సి పరాన్జీ. ఒకరు ‘బావగారు బాగున్నారా’ మరొకటి ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’. ‘మాస్టర్’ వంటి సీరియస్ కమర్షియల్ డ్రామా తర్వాత చిరంజీవితో ఔట్ అండ్ ఔట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు జయంత్ సి పరాన్జీ. ముఖ్యంగా ‘అంజి’ తో డిజాస్టర్ మూటగట్టుకున్న చిరుకి ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు జయంత్. ఆ సినిమా హిందీలో హిట్టే. కానీ తెలుగులో రీమేక్ చేసినప్పుడు మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

Shankar Dada Zindabad

ఒరిజినల్ తో పోలిస్తే జయంత్ చేసిన మార్పులు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఒరిజినల్ ను చాలా ఓన్ చేసుకుని.. చిరు ఇమేజ్ ను, కామెడీ టైమింగ్ ను దృష్టిలో పెట్టుకుని శంకర్ ప్రసాద్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు జయంత్. ఒకప్పుడు జయంత్ కూడా స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు అనే సంగతి తెలిసిందే.

 

‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ సూపర్ హిట్ అవ్వడంలో జయంత్ డైరెక్షన్ క్రెడిబిలిటీ చాలా ఉంది. దీంతో సీక్వెల్ అయిన ‘శంకర్ దాదా జిందాబాద్’ దర్శకత్వ బాధ్యతలు కూడా జయంత్ కు అప్పగించాలని చూశారు చిరు.కానీ తర్వాత జయంత్… తరుణ్ తో చేసిన ‘సఖియా’.. బాలకృష్ణతో చేసిన ‘అల్లరి పిడుగు’ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో అతన్ని తప్పించి అప్పటికి తమిళంలో ‘పోకిరి’ ని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభుదేవాకి ‘శంకర్ దాదా జిందాబాద్’ బాధ్యతలు అప్పగించారు చిరు. రీమేక్ ను ప్రభుదేవా కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలడు ని ‘పోకిరి’ రీమేక్ రిజల్ట్ తో చిరు నమ్మారు. కానీ ‘లగే రహో మున్నాభాయ్’ ని చిరు ఇమేజ్ కి తగ్గట్టు రీమేక్ చేయలేకపోయారు. ఫలితంగా 2007 జూలై 27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. కానీ పాటలు మాత్రం అదిరిపోతాయి. దేవి శ్రీ ప్రసాద్ చిరుకి ఫ్యాన్ బాయ్..లా మారిపోయి కంప్లీట్ గా డ్యూటీ చేశాడు.

నాగవంశీ వెనక్కి తగ్గడం మంచిదేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus