పోకిరి సెంటిమెంట్ తో ఇజం

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఇజం”. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శ కత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కళ్యాణ్ రామ్ ని డిఫరెంట్ లుక్ తో పూరి చూపించనున్నాడు. నందమూరి హీరో ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాక్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

జగపతి బాబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా విషయంలో డ్యాషింగ్ డైరక్టర్ పోకిరి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం  ఆ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాగ్ వద్ద వచ్చే ఫైట్ కీలకం. ఆ ఫైట్ ని గోల్కొండ ఫోర్ట్ లో చిత్రీకరించారు. ఇప్పుడు కూడా ఇజం లోని ఓ ఫైట్ ను  అక్కడే షూట్ చేస్తున్నారు. నిర్మాత బ్యాంకాక్ లో ప్లాన్ చేద్దామన్నా.. గోల్కొండలోనే యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నాడు పూరి. పోకిరి స్థాయిలో ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను  దసరా సందర్బంగా  సెప్టెంబర్ 29 న రిలీజ్ చేయాలని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus