Dimple Hayati: చిక్కుల్లో పడ్డ హీరోయిన్ డింపుల్ హయాతి… ఏమైందంటే..!

డింపుల్ హాయాతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న రామబాణం ప్రమోషన్స్ లో ఈమె పాల్గొన్న టైంలో .. మీరు ఈ ఫ్యామిలీ సినిమాలో వల్గర్ గా కనిపించారు.. అంటూ ఓ రిపోర్టర్ అనడంతో ఈమె బాగా ఫీలైపోయి .. గూగుల్ లో వల్గర్ అనే మాటకు అర్థం వెతుకుతున్నట్టు స్క్రీన్ షాట్ లు షేర్ చేసింది.దీంతో ఆ టాపిక్ అప్పుడు వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పై క్రిమినల్ కేసు నమోదవ్వడం.. కలకలం రేపింది అని చెప్పాలి. విషయంలోకి వెళ్తే.. డింపుల్ ప్రస్తుతం జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో అంటున్నారు. అదే అపార్ట్మెంట్లో ట్రాఫిక్ డిసిపి కూడా ఉంటున్నారు.

అయితే అక్కడ పార్క్ చేసిన డిసిపి రాహుల్ కారును .. డింపుల్ ఫ్రెండ్ ఢీ కొట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ అలాగే డింపుల్, డేవిడ్ ల పై గొడవ మొదలైంది. ఇదే క్రమంలో డింపుల్ ..రాహుల్ కారుని కాలితో తన్ని అతన్ని బెదిరించిందట. దీంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో డింపుల్, డేవిడ్ ల పై క్రిమినల్ కేసు నమోదు చేశాడు రాహుల్. దీంతో డింపుల్ చిక్కుల్లో పడినట్టు అయ్యింది.

2017 లో వచ్చిన ‘గల్ఫ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి… హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్లో నర్తించి బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘యురేకా’ ,రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖిలాడి’, విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సామాన్యుడు’, ధనుష్ – అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్రంగి రే’ వంటి క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇటీవల వచ్చిన రామబాణం లో కూడా ఈమె హీరోయిన్ గా నటించగా.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా డింపుల్ చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయని టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus