పి.ఆర్.ఓలుగా మారుతున్న పొలిటీషియన్స్

ఒక సినిమా పబ్లిసిటీ చేయాలంటే సినిమా ప్రారంభోత్సవం, ఫస్ట్ లుక్ రిలీజ్, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ చాలా హంగామా చేసి సినిమాను జనాల దగ్గరకి చేరుస్తుంటారు. ఈ పబ్లిసిటీలో సినిమా పీయార్వోలు కీలకపాత్ర పోషిస్తుంటారు. వాళ్ళే సినిమాని పబ్లిక్ కి దగ్గర చేయడంలోనూ, సినిమాకి పాజిటివ్ బజ్ తీసుకురావడంలో తోడ్పడుతుంటారు. పి.ఆర్.ఓ జాబ్ అనేది నిజానికి చిత్రపరిశ్రమకు సంబంధించిన రిపోర్టర్స్, లేదా సీనియర్ సినిమా జర్నలిస్టులు చేసే పని.. కానీ ఈమధ్య ఈ రంగంలోకి అడుగిడుతున్నారు మన సీనియర్ పొలిటీషియన్స్. పాలిటిక్స్ లో బాగానే సంపాదిస్తున్నారు కదా.. మళ్ళీ ఈ పార్ట్ టైమ్ జాబ్ ఏంటీ అనుకొంటున్నారా. పొలిటీషియన్స్ సినిమా పి.ఆర్.ఓలుగా అనేది “విశ్వరూపం” సినిమా నుంచి మొదలైంది. కేవలం తెలుగు-తమిళ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన “విశ్వరూపం” చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది దివంగత నేత జయలలిత, దాంతో మామూలు హిట్ సినిమా అయిన “విశ్వరూపం” సూపర్ హిట్ అయ్యి కూర్చుంది.

ఆ తర్వాత రీసెంట్ గా తెలుగులో వచ్చిన “అర్జున్ రెడ్డి” పోస్టర్స్ విషయంలో సీనియర్ పొలిటీషియన్ వి.హనుమంతరావు చేసిన రచ్చ పుణ్యమా అని సినిమాకి భారీ పబ్లిసిటీ లభించింది. ఇక గత నెల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన “మెర్సల్, పద్మావతి” చిత్రాల విషయంలో బిజేపీ ప్రభుత్వం చేసిన హల్ చల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే వాళ్ళ హడావుడి పుణ్యమా అని సినిమాలకి నేషనల్ లెవల్లో పబ్లిసిటీ దొరికిందనుకోండి. అయితే.. ఇంత హడావుడి జరిగాక సినిమా విడుదలను అసలెందుకు అడ్డుకొంటున్నారో వారికే క్లారిటీ ఉండడం లేదు. ఈ గొడవల పుణ్యమా అని పొలిటీషియన్స్ లైమ్ లైట్ లోకి వస్తూ చానల్స్ ద్వారా పబ్లిసిటీ పొందుతుంటే.. సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. కానీ.. మధ్యలో ఏ సంబంధం లేని జనాలు ఇబ్బందిపడాల్సి వస్తుంది. కోట్ల రూపాయల ప్రజాధానం ధ్వంసం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా చొరవ తీసుకొని భవిష్యత్ లో ఈ తరహా అనవసరమైన చర్చలు, రచ్చలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus