Ponniyin Selvan1: ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకి భారీ కలెక్షన్స్!

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకి వేరే భాషల్లో రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ.. తమిళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అది ఏ స్థాయిలో అంటే తొలి రోజు నుంచి ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. తమిళంలో ఒక్కో బాక్సాఫీస్ రికార్డుని ‘పొన్నియిన్ సెల్వన్’ తన ఖాతాలో వేసుకుంటుంది. తమిళనాట అత్యంత వేగంగా రూ.100 కోట్లు సాధించిన సినిమా ఇదే. ఈ ఏడాది అత్యధిక తొలి రోజు, తొలి వీకెండ్ వసూళ్లు రాబట్టిన సినిమాగా ఘనత సాధించింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే రూ.300 కోట్లకు చేరుకోవడం విశేషం. కాగా తమిళ వెర్షన్ నుంచే 80 శాతానికి పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే తమిళంలో బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన ‘పొన్నియిన్ సెల్వన్’.. త్వరలోనే ‘విక్రమ్’ కలెక్షన్స్ ను కూడా అధిగమించబోతుంది. ఫుల్ రన్ లో ‘2.ఓ’ను దాటి నెంబర్ వన్ తమిళ సినిమాగా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవర్సీస్ లో ఇప్పటికే ‘2.ఓ’ కలెక్షన్స్ ను ఈ సినిమా అధిగమించింది.

దాదాపుగా ‘పొన్నియిన్ సెల్వన్’ విడుదలైన ప్రతి దేశంలోనూ ఇదే ఆల్ టైం నెంబర్ వన్ తమిళ సినిమాగా రికార్డు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాలో ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సాధించిన కలెక్షన్స్ ను ‘పొన్నియిన్ సెల్వన్’ మూడు రోజుల్లోనే దాటేసింది. అక్కడ ఈ సినిమా కలెక్షన్స్ 5 మిలియన్ డాలర్లు దగ్గరవుతున్నాయి.

తమిళులు ఈ సినిమా చూడడం బాధ్యతగా తీసుకున్నట్లున్నారు. అక్కడ సాహిత్య చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు దీనికి రెండో పార్ట్ రాబోతుంది. వచ్చే ఏడాదిలో సెకండ్ పార్ట్ రిలీజ్ కానుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus