Ponniyin Selvan Collections: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ ఫస్ట్ వీకెండ్ బాగా కలెక్ట్ చేసింది

ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఫిలిం మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. 4 దశాబ్దాలుగా ఆయన తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి నానా తిప్పలు పడి తీసిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దీని మొదటి భాగాన్ని ‘పీఎస్-1’ గా సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్టుని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించారు.

తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల అయ్యింది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడడానికి కారణం అని చెప్పొచ్చు. తెలుగులో ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది.

కానీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు, మూడో రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 4.12 cr
సీడెడ్ 0.69 cr
ఉత్తరాంధ్ర 0.62 cr
ఈస్ట్ 0.49 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.40 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.44 cr

‘పొన్నియన్ సెల్వన్ – 1’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.8.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.7.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజున ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. అయితే సోమ,మంగళ వారాల్లోనే ఈ మూవీ సాధ్యమైనంత వరకు కలెక్ట్ చేయాలి. ఎందుకంటే గాడ్ ఫాదర్, ఘోస్ట్ వంటి బడా సినిమాలు బుధవారం రిలీజ్ కాబోతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus