Ponniyin Selvan1: తమిళ క్రిటిక్స్ పొన్నియిన్ సెల్వన్ గురించి అలా అన్నారా?

మణిరత్నం డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. బాహుబలితో పోల్చుకుని ఈ సినిమాను చూసిన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమా తమకు ఏ మాత్రం నచ్చేలా లేకపోవడంతో తెగ ఫీలవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్ చేసుకున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.

టాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాకు తక్కువగానే రేటింగ్స్ ఇస్తుండటం గమనార్హం. అయితే తమిళ క్రిటిక్స్ మాత్రం పొన్నియిన్ సెల్వన్ కు పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమాలో అసలు నెగిటివ్ పాయింట్స్ లేవనే విధంగా కోలీవుడ్ క్రిటిక్స్ వ్యవహరించారు. తమిళంలో కొంతమంది క్రిటిక్స్ ఈ సినిమాకు 4కు అటూఇటుగా రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ సినిమా బాహుబలిని మించి అద్భుతంగా ఉందనేలా తమిళ క్రిటిక్స్ కామెంట్లు చేశారు.

పొన్నియన్ సెల్వన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నా మిగతా సన్నివేశాలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం గమనార్హం. తమిళనాడు ప్రేక్షకులు ఇలాంటి క్వాలిటీ లేని సినిమాలను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో కూడా ఈ తరహా సినిమాలే వచ్చే అవకాశం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలుగులో డిజాస్టర్లుగా నిలిచిన కొన్ని సినిమాలు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

సినిమాకు టాక్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉండటం తమిళ వెర్షన్ కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావడం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అయింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus