Pooja Hedge: ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ చెప్పిన పూజ.. ట్రై చేస్తారా!

పూజా హెగ్డే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 11 ఏళ్లు అవుతుంది. అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. ఈ మాట అందరి హీరోయిన్లకు చెబుతుంటారు. ఇందులో కొత్తేముంది అంటారా? కావాలంటే ఒకసారి ‘మాస్క్’ సినిమాలో పూజను, ఇప్పుడు పూజను చూడండి. అప్పటి కంటే గ్లామర్‌ ఇంకాస్త పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే అప్పుడు, ఇప్పుడు ఆమె ఫిట్‌నెస్‌ మాత్రం ఒకేలా ఉంది. ఆ కర్వీ బాడీని చక్కగా మెయింటైన్‌ చేస్తూ వస్తోంది…

తాజాగా తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ గురించి చెప్పింది పూజా హెగ్డే. ఆమె ఫిట్‌నెస్‌ ‘పైలెట్స్ ఎక్సర్ సైజ్’ అంట. పూజ రోజులో ఎక్కువసేపు ఈ వ్యాయామమే చేస్తుందట. జిమ్‌కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలెట్స్ సెషన్స్ చేస్తుందట. ఈ సెషన్స్‌ మిస్‌ చేసే రోజు ఉండదట. ముంబయిలో ఉన్నా, ఇక్కడ ఉన్నా రోజులో కొంత సమయం పైలెట్స్‌ కోసం సమయం కేటాయిస్తుందట. దీంతోపాటు యోగా కూడా ఎక్కువగా చేస్తుంటుందట. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు సంపాదిస్తోందట ఆ మాత్రం చేయాలిగా మరి.

మన దగ్గర హీరోయిన్ కాస్త లావెక్కినా ఓకే కానీ, బాలీవుడ్‌లో అస్సలు కుదరదు. అందుకే పూజ అలా పక్కాగా ఉంటుంది. సినిమాల విషయానికొస్తే పూజ నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’త్వరలో విడుదలవుతాయి. విజయ్ ‘బీస్ట్’లో నటిస్తోంది. దీంతోపాటు మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమాకు ఓకే చెప్పింది..

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus