ప్రభాస్ క్రేజ్ నన్ను కలవర పెట్టిస్తోంది : పూజా హెగ్డే

ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే (Pooja Hegde) , ఆ తర్వాత చేసిన “ఒక లైలా కోసం”లో కూడా చక్కని నటనతో ఆకట్టుకుంది. అయితే దువ్వాడ జగన్నాథం లో స్టైల్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచి స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. రంగస్థలంలో చరణ్ తో కలిసి ఓ ప్రత్యేక పాటలో అందాలు ఆరబోసింది. అలాగే శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సాక్ష్యం సినిమాలో హీరోయిన్ గా సైన్ చేసింది. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేయనున్న సినిమాలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమాలోను హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

అంతేకాదు సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయనున్న మూవీలో ఛాన్స్ అందుకుంది. దీనిపై  పూజా హెగ్డే స్పందించింది.  ” ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటి వెళ్లింది. ఆయనకున్న క్రేజ్. ఇమేజ్ అంతా ఇంతా కాదు. అది తలచుకున్నప్పుడే నాలో టెన్షన్ మొదలవుతోంది. అయినా నేను బెదిరిపోకుండా .. దర్శకుడు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకుని .. మరింత మంచి పేరు తెచ్చుకుంటా” అంటూ వెల్లడించింది. ఈ చిత్రాల తర్వాత పూజా టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానం కైవసం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus