ఆరు నెలలపాటు అమ్మడు యమ బిజీ.!

ఈ హీరోయిన్ల జీవితాలన్నీ “అతివృష్టి, అణావృష్టి” అన్నట్లుగా ఉంటాయి. అందుకు కారణం వాళ్ళ క్రేజ్ ఎప్పుడూ ఒకేలా ఉండకపోవడం, సినిమా హిట్, ఫ్లాప్ మీద వాళ్ళ జాతకాలు ఆధారపడి ఉండడం వంటి కారణాల రీత్యా హీరోయిన్లు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు ఫ్రీగా ఉంటారనేది కనీసం ఎక్స్ పెక్ట్ కూడా చేయలేం. అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని మాత్రం బాగా ఫాలో అవుతారు. అందుకే ఫేమ్ ఉన్నప్పుడే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటారు. ఇప్పుడు ఈ ఫార్మాట్ ను ఫాలో అవుతుంది పూజా హెగ్డే. ఎప్పుడో ఏడేళ్ళ క్రితమే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైనప్పటికీ.. “దువ్వాడ జగన్నాధం”తో తన సొగసుల సత్తాను ఘనంగా చాటేంతవరకూ ఆమెను కనీసం హీరోయిన్ గా గుర్తించినవాళ్ళు కూడా లేరు.

అలాంటి పూజా హెగ్డేకు ప్రస్తుతం తెలుగులో ఏకంగా మూడు భారీ ఆఫర్లు ఉన్నాయి. ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమా, ప్రభాస్-రాధాకృష్ణ సినిమా, మహేష్-వంశీ పైడిపల్లి సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూడు సినిమాల షూటింగ్స్ నెక్స్ట్ 6 మంత్స్ తో స్టార్ట్ అవ్వనుండడం విశేషం. ఈ సినిమాలకు ముందు అమ్మడు “సాక్ష్యం” ప్యాచ్ షూట్ కంప్లీట్ చేయనుంది. సో, ఈ మూడు తెలుగు సినిమాలు కాకుండా మరో రెండు బాలీవుడ్ ఆఫర్లు కూడా అమ్మడికి ఉన్నాయి కాబట్టి వచ్చే ఏడాది వరకూ అమ్మాయిగారి డైరీ ఫుల్ బిజీ అన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus