బాలీవుడ్ లో మళ్ళీ పూజా హెగ్డే కు చేదు అనుభవం..!

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఎవరంటే.. టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఇప్పటీకే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పక్కన సినిమాలు చేసేసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన కూడా సినిమా చేస్తుంది. వరుణ్, నాగ చైతన్య వంటి కుర్ర హీరోల పక్కన కూడా నటించేసింది. అయితే ఈ అమ్మడికి ఒకే ఒక్క కోరిక మాత్రం అలానే ఉండి పోయింది. అదే బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించాలని..!

‘ఒక లైలా కోసం’ ‘ముకుంద’ సినిమాలు చేస్తున్నప్పుడే హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కింది. అయితే ‘మహోన్జదారో’ చిత్రం పెద్ద డిజాస్టర్ అవ్వడంతో అక్కడ ఈమెను పట్టించుకున్న వారు లేరు. దీంతో మళ్ళీ టాలీవుడ్ వచ్చి ‘డీజే’ ‘అరవింద సమేత’ ‘మహర్షి’ వంటి చిత్రాలు చేసి మళ్ళీ ఫామ్లోకి రావడంతో.. ‘హౌస్ ఫుల్4’ లో అవకాశం దక్కింది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోకి మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర కూడా ఉంది కాబట్టి పూజా హెగ్డే కు ఈసారి కలిసొస్తుంది అని అంతా అనుకున్నారు. అయితే ఈరోజు విడుదలైన ‘హౌస్ ఫుల్4’ కి డిజాస్టర్ టాక్ వచ్చింది. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రానికి 1.5 రేటింగ్ ఇచ్చి ఏకిపారేస్తున్నారు. దీంతో పూజకు అక్కడ పెద్ద దెబ్బే పడింది అని చెప్పాలి. అక్షయ్ కుమార్ వంటి మినిమం గ్యారంటీ సినిమాకే డిజాస్టర్ అనే టాక్ వచ్చిందంటే పూజా ఐరన్ లెగ్ అంటూ కొందరు అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలు పెట్టేసారు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus