Pooja Hegde: మహేష్ ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చిన ‘SSMB28’ యూనిట్..!

ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అతని అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించిన రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు వచ్చాయి. ఆల్రెడీ ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్(టీజర్) కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మూవీకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాతలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు. ఈ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఫిక్స్ చేసినట్టు ఖరారు చేశారు.

అలాగే సంగీత దర్శకుడిగా తమన్, ఎడిటర్ గా నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ గా మది, ఆర్ట్ డైరెక్టర్ గా ఎ.ఎస్.ప్రకాష్ ఎంపికైనట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించారు.అయితే మొదటి నుండీ ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ గత చిత్రమైన ‘అల వైకుంఠపురములో’ మూవీకి పనిచేసిన టీమే పనిచేస్తారని ప్రచారం జరిగింది. కానీ సినిమాటోగ్రాఫర్ విషయంలో మాత్రం పి.ఎస్.వినోద్ ప్లేస్ లో మది వచ్చి చేరాడు. ‘సర్కారు వారి పాట’ మూవీకి కూడా అతనే సినిమాటోగ్రాఫర్. మహేష్ బాబుని ఆ మూవీలో ఎంత గ్లామర్ గా చూపించబోతున్నాడో.. ఈరోజు టీజర్ ను బట్టి స్పష్టమవుతుంది.

గతంలో వీరి కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ కూడా వచ్చింది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే తో మహేష్ చేస్తున్న రెండో మూవీ ఇది. మహేష్ 25వ సినిమా అయిన ‘మహర్షి’ లో ఈమెనే హీరోయిన్ గా నటించింది. ఇక త్రివిక్రమ్ తో అయితే ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల్లో నటించింది. ఏమైనా ఈ క్యాస్ట్ అండ్ క్రూ అప్డేట్ తో ఈ ప్రాజెక్టు పై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు ‘SSMB28’ టీం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus