Pooja Hegde: ఆ గొడవ వల్ల ఇబ్బంది పడిన పూజా హెగ్డే.. ఆందోళనలో ఫ్యాన్స్.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ ‘ముకుంద’ వంటి సినిమాలతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటించిన ‘ మొహంజదారో’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంటనే టాలీవుడ్ కి రిటర్న్ వచ్చేసింది. ఈ క్రమంలో చేసిన ‘దువ్వాడ జగన్నాథం'(డీజే) సినిమా ఈమెకి మంచి బ్రేక్ ఇచ్చింది.

ఆ తర్వాత ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే కొత్త హీరోయిన్ల హవాతో ఈమెకు గట్టి పోటీ ఎదురవుతుంది. అలాగే పూజా హెగ్డే నటించిన గత సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో ఆమె కెరీర్ కొంత స్లో అయ్యింది. కానీ ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా పూజా హెగ్డేని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట.

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల పూజా హెగ్డే దుబాయ్‏ కి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్టు భయాన్ని చెప్పుకొచ్చాడు. అదే టైంలో పూజా హెగ్డేని చంపేస్తామని కొందరు బెదిరించారట. ఈ క్రమంలో భయపడిపోయిన పూజా హెగ్డే (Pooja Hegde) వెంటనే..

దుకాణం సర్దేసి ఇండియాకి తిరిగి వచ్చేసిందని తెలిపాడు.భయాని ఇలా చెప్పడంతో పూజా హెగ్డే అభిమానులు షాక్ కి గురయ్యారు. కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ.. పూజా హెగ్డే క్షేమంగా ఇండియాకి రావాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ టాపిక్ వైరల్ అవుతుంది

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus