Pooja Hegde: ఎన్టీఆర్.. పూజ కలిసి ఫొటో దిగలేదా?

తండ్రి పుట్టినరోజునాడు… కొడుకుతో దిగిన ఫొటో పెట్టి విషెస్‌ ఎవరైనా చెబుతారా? కానీ పూజా హెగ్డే చెప్పింది. కావాలంటే ట్విటర్‌లోకి వెళ్లి నిన్న ఆమె ఏం పోస్ట్‌ చేసిందో చూడండి. అంతేకాదు ఆమె అలా ఈ ఫొటో పెట్టడానికి కారణం కూడా చెప్పింది. దీంతో నెటిజన్లలో నవ్వులు పూస్తున్నాయి. అంతే కాదు ఏంటి.. కనీసం ఎన్టీఆర్‌తో దిగిన ఫొటో ఒక్కడి కూడా లేదా? అని ప్రశ్నలు వేస్తున్నారు. దానికి సమాధానం ఆమె ట్వీట్‌లోనే ఇచ్చేసిందనుకోండి.

గురువారం ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా పూజ విష్‌ చేసింది. దాంతోపాటు రెండు ఫొటోలు షేర్‌ చేసింది. అందులో హెయిర్‌ స్ప్రే బాటిల్స్‌ పట్టుకొని ఉన్నారు ఇద్దరు. అవెందుకు పట్టుకున్నారనేది పూజ చెప్పలేదు. అయితే ఏదో కారణం వల్ల ట్రోఫీల రేంజిలో పట్టుకొని ఫొటోకు పోజులిచ్చాం అనైతే చెప్పింది. దాంతోపాటు ‘మీతో రీసెంట్‌గా ఏ ఫొటో కూడా దిగలేదు.. కాబట్టి ఈ ఫొటోతో మీకు విషెస్‌ చెబుతున్నా’ అని రాసుకొచ్చింది పూజ. పోనీలే ఆమె ఫోన్‌లో పాత ఫొటోలన్నీ పోయాయి అనుకుందాం.

ఈ ఫొటో చూస్తుంటే… ‘అరవింద సమేత’ టైమ్‌లో దిగిన ఫొటోలా కనిపిస్తోంది. అంటే ఆ సినిమా సమయంలో కొడుకుతో దిగిన ఫొటోల ఉంది కానీ, తండ్రితో దిగిన ఫొటో లేదా అనే డౌట్‌ వస్తుంది. లేకపోతే ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో అసలు ఫొటోనే దిగలేదా అనే డౌట్‌ కూడా వస్తుంది. మామూలుగా అయితే పూజ సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఫొటో దిగే ఉండాలి. లేదంటే కనీసం వర్కింగ్ స్టిల్‌ అయినా ఉండి ఉండాలి. అవన్నీ వదిలేసి ఈ ఫొటోనే ఎందుకు షేరింగ్‌ చేసిందబ్బా… ఏదో డిస్కషన్‌ పాయింట్‌ కోసం కాకపోతే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus