సమ్మర్లో మరింత వేడిని పెంచుతున్న పూజా హెగ్దే..!

ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే… పూజ హెగ్దే అనే చెప్పాలి. అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడేసింది. ఇప్పుడు మహేష్,ప్రభాస్ ల చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మే లో ఈ భామ నటించిన ‘మహర్షి’ చిత్రం విడుదల కాబోతుంది. ఇక మరోసారి అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో పూజా హెగ్దేను హీరోయిన్ గా ఎంచుకున్నారు. త్రివిక్రమ్ గత చిత్రమైన ‘అరవింద సమేత’ చిత్రంలో కూడా ఈ భామే హీరోయిన్. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రకారుని హీటెక్కిస్తూ ఉంటుంది ఈ భామ. అసలే సమ్మర్… ఇప్పుడు తన హాటు ఫోటో షూట్లతో మరింత వేడిని పెంచే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా ఈ భామ ఓ ఈవెంట్ కు హాజరయ్యింది. క్యాజువల్ గానే ఈ అమ్మడు అందాల విందు చేసే డ్రెస్సులు తెగ వేస్తుంటుంది. అలాంటిది ఇలాంటి ఈవెంట్లకి వచ్చేప్పుడు మాత్రం తగ్గుతుందా..! యమా హాటుగా డ్రెస్సును ధరించింది. ‘సహసవీరుడు సాగరకన్య’ చిత్రంలో శిల్పాశెట్టి మాదిరిగానే పూజా హెగ్దే కూడా పొడుగు కళ్ళ సుందరిలా కనిపిస్తుంది. వెనుక భాగం.. నుండీ ముందు భాగం వరకూ.. అలాగే టాప్ ను సైతం చూపిస్తూ వింత వింత ఫోజులిస్తూ మరింత వేడిపుట్టిస్తుంది ఈ భామ. ఇక ఈ పిక్స్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లలో షేర్ చేయడం.. ఆలస్యం లక్షల కొద్దీ లైకులు వచ్చి పడ్డాయి. ఈ మధ్య గ్లామర్ తో ఎక్కువ వైరల్ అవుతున్న హీరోయిన్లలో పూజా అగ్రస్థానంలో ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus