బాలీవుడ్ స్టార్ హీరోతో పూజా రొమాన్స్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజాహెగ్డే వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’, అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీకి బాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలతో నటించిన పూజా త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో కనిపించబోతుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఇంకా అధికార ప్రకటన రానప్పటికీ దాదాపుగా పూజాని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పూజాహెగ్డేకి మరో భారీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ‘సర్కస్’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా కనిపించనున్నాడు. భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ‘గోల్ మాస్’ సిరీస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రోహిత్ శెట్టి.. ఇప్పుడు ‘సర్కస్’ను కూడా కామెడీ ఫ్రాంచైజీగా రూపొందించనున్నాడట. అంటే ఈ సిరీస్ లో తరువాత కూడా సినిమాలు రానున్నాయన్నమాట.

అదే నిజమైతే పూజా పంట పండినట్లే. చివరగా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. దానికి నెగెటివ్ టాక్ వచ్చినా.. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఓపక్క సల్మాన్ తో సినిమా అనుకుంటుండగానే.. ఇప్పుడు రణవీర్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం పూజాకి ఆనందాన్ని కలిగిస్తుందట. మొత్తానికి ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా బిజీ కానుంది.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus