సినిమా సైన్ చేయాలంటే సెట్లో అవి కంపల్సరీ అంటున్న పూజా

సినిమా సైన్ చేయడానికి హీరోహీరోయిన్లు ప్రొడ్యూసర్స్ కి చిత్రవిచిత్రమైన కండీషన్స్ పెడుతుంటారు. కొందరు క్యారీవ్యాన్ కావాలని అడిగితే.. ఇంకొందరు అసిస్టెంట్స్ ఎక్కువ మంది కావాలని, ఫలానా హోటల్ నుంచే రోజు ఫుడ్ కావాలని ఇలా చాలా కండీషన్స్ పెడతారు. కానీ.. రైజింగ్ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఒక విచిత్రమైన కండీషన్ పెడుతోందట. అది పెద్ద ప్రోబ్లమేటిక్ కండీషన్ కాకపోయినా.. ఆ విచిత్రమైన కండీషన్ కి మాత్రం షాక్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు.

ఇంతకీ ప్రొడ్యూసర్లను అంతగా షాక్ కి గురి చేస్తున్న కండీషన్ ఏమిటి అనుకొంటున్నారా ? షూటింగ్ స్పాట్ లో ఆమెకు అంతా ఎంటర్ టైనింగ్ గా ఉండాలట. అస్సలు సీరియస్ నెస్ అనేది ఉండకూడదట. సెట్ లో అందరూ సీరియస్ గా ఉంటే గనుక తాను సెట్ నుంచి వెళ్లిపోతానని చెప్పేసిందట పూజ. కండీషన్ సిల్లీగా ఉన్నా.. పెద్ద కష్టం కాకపోవడంతో ఒప్పేసుకొంటున్నారట. సో, పూజా హెగ్డేకి రెమ్యూనరేషన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఎంజాయ్ మెంట్ అన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus