ప్రభాస్ వలనే తను పేద అమ్మాయి అయ్యిపోయిందట..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్దే హీరోయిన్ గా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ కు 20 వ చిత్రం. గోపి కృష్ణ మూవీస్, యూ.వి.క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పక్క సుజీత్ డైరెక్షన్లో ‘సాహూ’ చిత్రం చేస్తూనే మరో పక్క ఈ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకోవడం విశేషం.

1960 కాలంలో జరిగిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ధనవంతుడు పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఇక ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే ఓ పేదింటి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్టు తాజా సమాచారం. ఇటువంటి పేదింటి అమ్మాయితో ఈ ధనవంతుడైన ఎలా ప్రేమలో పడతాడు…? ఏ పరిస్థితుల్లో తనని ప్రేమించాడు ? అనేది చాలా ఆసక్తినియాంశంగా మారుతుందట . ఊహించని మలుపులతో ఈ చిత్రం కట్టి పడేస్తుందని తెలుస్తోంది. యూత్ .. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయట. ఇక ఈ ప్రేమకథా చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus