Pooja Hegde: గెలుపోటములు రెండూ సమానమే..ట్రోలర్స్ కి పూజ గట్టి సమాధానం!

ముకుంద సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి పూజా హెగ్డే. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. పూజా అందం, అభినయంతో అభిమానుల్ని ఆకట్టుకున్నప్పటికీ ఈమె నటించిన సినిమాలు మాత్రం ఎక్కువగా ప్లాప్ అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమా లో నటించిన పూజ ఆ సినిమా ద్వారా మంచి విజయం అందుకుంది.

ఈమె ప్రస్తుతం తెలుగు హిందీ తమిళ భాషలలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది .ఇటీవల పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి పూజా హెగ్డే కారణమని, దీంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు ఏకంగా ఆమెను సినిమాలలో తీసుకోవడంతో కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకాలం తనపై వస్తున్న ట్రోల్స్ చుసి మౌనంగా ఉన్న పూజా హెగ్డే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి తీవ్రంగా ఖండించింది. పూజా హెగ్డే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు గెలుపు ఓటమి రెండూ సమానమే. నాకు కథ నచ్చే నేను సినిమాలు చేస్తాను. కొన్ని సందర్భాలలో ఫలితం మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు. కానీ నేను చేసిన సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను దానిని సంతోషంగా ఆక్సెప్ట్ చేస్తా.

ఇది వరకు నేను నటించిన ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యాయి. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను చేసిన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా నేను సంతోషంగా స్వీకరిస్తాను… అంటూ తనపై ఐరన్ లెగ్ అని ముద్ర వేసి ట్రోల్స్ చేస్తున్న వారికి పూజాహెగ్డే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus