ప్రేమ వార్తల పై నోరు విప్పిన పూజా హెగ్దే…!

టాప్ హీరోయిన్ లు … వాళ్ళ ప్రేమ వార్తలు… పెళ్ళి వార్తలు … ఏవీ జనాలకి కొత్త కాదు. పలనా టాప్ హీరోయిన్ ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుంది.. ఇవిగో ప్రూఫ్ అంటూ కొన్ని ఫోటోలు రావడం … వాటిని హీరోయిన్ లు ఖండించడం .. ఏమీ లేదు ఆ హీరో నాకు స్నేహితుడు మాత్రమే అని చెప్పడం కూడా పాత తంతే.

అయినప్పటికీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోయిన్ కాబట్టి ఈమె కూడా ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అప్పటి బాలీవుడ్ స్టార్ వినోద్ మెహ్రా కొడుకు రోహన్ మెహ్రాతో పూజా హెగ్దే పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల పై పూజా హెగ్దే తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ..” రోహన్ కు నాకు మధ్య అలాంటిదేమీ లేదు.

మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. రోహన్.. నేను కొన్ని పార్టీలలో కలిసిన ఫొటోలు ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తూ వస్తున్నారు. ఈ పుకార్లకు ఇప్పటికైనా ముగింపు పలకాలి” అంటూ రొటీన్ గానే జవాబు ఇచ్చింది. అయితే ఇవి వట్టి రూమర్స్ మాత్రం కాదనేది కొందరి అభిప్రాయం. మరికొంత మంది పూజా హెగ్దే ఎలాగూ బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది కాబట్టి రోహన్ తో సన్నిహితంగా ఉంటూ వస్తుంది అని మరికొంత మంది చెబుతున్నారు.


Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus