Pooja Hegde: సల్మాన్ మూవీలో వెంకీ పాత్ర ఎలా ఉండబోతుందంటే..!

  • May 14, 2022 / 05:20 PM IST

వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్3’ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. మరో పక్క రానాతో కలిసి వెబ్ సిరీస్ చేయబోతున్నాడు వెంకీ. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరో. వెంకీ.. సల్మాన్ తో ఓ మూవీ చేయబోతున్నట్టు చాలా రోజుల నుండీ వార్తలు వస్తున్నాయి. ప‌ర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. `క‌బీ ఈద్ క‌బీ దీవాళి`, `భాయ్ జాన్` వంటి పేర్లని ఈ మూవీ కోసం అనుకుంటున్నారు.

ఇది ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. సల్మాన్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. జగపతి బాబు ఈ మూవీలో విలన్ గా నటించబోతున్నారు. కాగా ఈ మూవీలో వెంకటేష్ పాత్ర పై కూడా కొంత క్లారిటీ వచ్చింది. ఈ మూవీలో పూజా హెగ్డేకి అన్న‌గా వెంక‌టేష్ క‌నిపిస్తాడని తెలుస్తుంది.జూన్ మొదటి వారం నుండీ వెంకీ షూటింగ్ లో పాల్గొంటాడట.వెంక‌టేష్ పాత్ర‌ నిడివి ఎంత..

సల్మాన్ ఖాన్ తో అతనికి కాంబినేషనల్ సీన్స్ ఉంటాయా అన్న విషయం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్లో నటించడం వెంకటేష్ కు ఇది మొదటి సారి కాదు.. ‘చంటి’ ‘యమలీల’ వంటి చిత్రాలకి హిందీలో రీమేక్ లుగా తెరకెక్కిన ‘అనారి’ (1993), ‘త‌ఖ్ దీర్ వాలా’ (1995) వంటి చిత్రాల్లో వెంకీ నటించారు.కానీ అవి విజయాలు సాధించలేదు.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా అయినా అంగీకరించలేదు. మళ్ళీ 27 ఏళ్ళ తర్వాత ఆయన బాలీవుడ్ సినిమాలో నటించడానికి వెంకీ ఒప్పుకున్నారు. మరి ఈసారైనా హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus